సర్కారీ స్కూళ్ల బ్రేక్ఫాస్ట్ స్కీంకు రూ.22 కోట్లకు పైగా విరాళాలు!
Jul 24, 2026,
సర్కారీ స్కూళ్ల బ్రేక్ఫాస్ట్ స్కీంకు రూ.22 కోట్లకు పైగా విరాళాలు!
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ స్కీంకు భారీగా విరాళాలు అందాయి. అరబిందో ఫార్మా రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ రూ.12.18 కోట్ల CSR నిధులను అందించాయి. మొత్తం రూ.22.18 కోట్లతో ఈ పథకానికి అదనపు చేయూత లభించింది. హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్లకు రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.
