హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులతో పాటు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.?
అదేవిధంగా రైతుల సమస్యలు, నిరుద్యోగం, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సభలో విస్తృత చర్చ జరిగే అవకాశముంది. ప్రభుత్వాన్ని ఈ అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే, సమావేశాల తేదీలు మరియు అజెండాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
