లేహ్‌లో భారీ భూకంపం.. 5.5 తీవ్రతతో కంపించిన భూమి
ఆగస్టు 13, 2026:
జమ్మూకశ్మీర్‌లోని లేహ్ (లద్దాఖ్) ప్రాంతంలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) ప్రకారం రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదు.

