ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు విజేత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని లయోలా కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ జర్నలిస్టుల జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొనగా, ఉత్కంఠభరితంగా సాగిన పోటీల అనంతరం తెలంగాణ జట్టు, కడప జట్టు ఫైనల్‌కు చేరుకున్నాయి.
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 106 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కడప జట్టు తెలంగాణ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తట్టుకోలేక 96 పరుగులకే పరిమితమైంది. దీంతో తెలంగాణ జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
తెలంగాణ జట్టు విజయంలో రవికిరణ్, బొడిగ శ్రీను, రాజ్‌కుమార్, షేక్ రఫీ, మోహన్, రామరాజు, గంగాధర్, ఇమ్రాన్, అన్వేష్ తమ అద్భుత ఆటతీరుతో కీలక పాత్ర పోషించారు. వారి సమిష్టి ప్రదర్శనతో తెలంగాణ జట్టు టోర్నీలో విజేతగా అవతరించింది.
ఈ విజయంతో తెలంగాణ జర్నలిస్టుల జట్టుకు సహచరులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.
