గీతాంజలి కళాశాలలో ఘనంగా AI-DAY ప్రాజెక్ట్ ఎక్స్పో & హెచ్ఆర్ కాన్క్లేవ్
విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలకు వేదికగా కార్యక్రమం
ఘట్కేసర్: గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ CS&I ఆధ్వర్యంలో CSE (AI&ML) విభాగం నిర్వహించిన AI-DAY ప్రాజెక్ట్ ఎక్స్పో & HR కాన్క్లేవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు విద్యా రంగానికి, పరిశ్రమలకు మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, చాట్‌బాట్స్, హెల్త్‌కేర్, స్మార్ట్ ఆటోమేషన్, డేటా అనలిటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాలకు సంబంధించిన వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. వాస్తవ ప్రపంచంలో ఎదురవుతున్న సమస్యలకు AI ఆధారిత పరిష్కారాలను అందించే దిశగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
HR ఎన్‌క్లేవ్‌లో భాగంగా పరిశ్రమల ప్రతినిధులు, మానవ వనరుల నిపుణులు విద్యార్థులతో సంభాషించి, ప్రస్తుత పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, కెరీర్ అభివృద్ధి తదితర అంశాలపై విలువైన సూచనలు అందించారు. అకాడమిక్ పరిజ్ఞానాన్ని పరిశ్రమల అవసరాలకు అనుసంధానం చేయడంలో HR కాన్క్లేవ్ కీలక వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జి. రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆర్. హరిచంద్ర రెడ్డి, డైరెక్టర్ ఉదయ్ కుమార్, ప్రిన్సిపల్ డి. సాగర్, డీన్–స్కూల్ ఆఫ్ CS&I వి. మధుసూదన రావు, CSE (AI&ML) విభాగాధిపతి ఎ. నాగేశ్వరరావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ రంగంలో విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది. AI-DAY ప్రాజెక్ట్ ఎక్స్పో & HR కాన్క్లేవ్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆవిష్కరణ, పరిశోధన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు మెరుగైన కెరీర్ అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయని పేర్కొంది.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన CSE (AI&ML) విభాగాధిపతి, అధ్యాపకులు, కోఆర్డినేటర్లు, కమిటీ సభ్యులు, వాలంటీర్లు మరియు విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
