న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌లో విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిరసనలో పాల్గొన్న వారిలో మొత్తం 2,873 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అధికారుల వివరాల ప్రకారం, వీరిలో 989 మందిపై హత్య, అత్యాచారం తదితర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయని సమాచారం. నిరసనకు హాజరైన వారి చిత్రాలను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా డేటాబేస్‌తో సరిపోల్చి ఈ వివరాలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది.
నిరసనలో అల్లర్లు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే నేర చరిత్ర కలిగిన వ్యక్తులను పంపించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
