15 నుంచి భద్రకాళి ఆలయంలో శాకంభరి నవరాత్రి మహోత్సవాలు
ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఆలయ అధికారులు
వరంగల్: ఓరుగల్లు ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీ శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామాల సునీత తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఉత్సవాల వివరాలను వెల్లడించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న శాకంభరి నవరాత్రి మహోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం శాకంభరి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ అధికారులు, అర్చకులు ఆవిష్కరించారు. మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
