హైదరాబాద్:జులై 24
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసేందుకు సంబంధించిన డిమాండ్ పై కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెలపడే సూచనలు కనిపిస్తున్నాయి,ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికం గా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది,
ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, అనంతరం విలీన ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మెలో ప్రభుత్వం లో విలీనం సహా 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుం చిన సంగతి పాఠకుల కు తెలిసిందే.
ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతభత్యాలు కల్పించాలని, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరాయి. వీటిలో ఎక్కువశాతం డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి చేసి, విలీన ప్రక్రియను తుది దశకు తీసుకెళ్లడం పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఎన్నికలు పూర్తయిన తర్వాత విలీనానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి, డిసెంబరు 9న ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.ఉద్యోగులు కోరిన డిమాండ్ల లో విలీన ప్రక్రియ, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రధానమైనవి.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా నియమించింది ప్రభుత్వం. దీంతో ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయిందని అధికారులు పేర్కొంటున్నారు.
