ఏజెంటిక్ ఏఐతో మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ నిర్ధారణపై వినూత్న పరిశోధన.. మార్గదర్శకుల సహకారంతో విజయవంతం
హైదరాబాద్: మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన మచర్ల సుప్రియ తన పరిశోధనలో విశేష ప్రతిభ కనబరిచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. “Development of a Calibration Aware Agentic AI Framework for Knee Osteoarthritis Diagnosis and Disease Monitoring” అనే అంశంపై ఆమె వినూత్న పరిశోధన చేపట్టారు. 2026 నవంబర్ 7న ఆమెకు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.
మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధిని సమర్థవంతంగా నిర్ధారించడం, వ్యాధి తీవ్రతను అంచనా వేయడం, వ్యాధి పురోగతిని పర్యవేక్షించడం లక్ష్యంగా ఈ పరిశోధన సాగింది. ఇందులో ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Agentic AI), ఎడ్జ్ డిప్లాయబుల్ AI (Edge-deployable AI) సాంకేతికతలను సమన్వయం చేశారు.
ముఖ్యంగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఏఐ ఆధారిత వైద్య సహాయక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ఈ పరిశోధన ప్రత్యేకత. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ తీవ్రతను గుర్తించడం, వ్యాధి గ్రేడింగ్‌ను విశ్లేషించడం, వైద్యులకు అర్థమయ్యే రీతిలో ఫలితాలను వివరించడం ద్వారా వైద్య నిర్ణయాలకు సహకరించే ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు.
ఈ పరిశోధన విజయవంతం కావడంలో పరిశోధన పర్యవేక్షకులైన డాక్టర్ థయ్యబా ఖాతూన్ మహమ్మద్, డాక్టర్ ఎం. రవికాంత్ కీలక పాత్ర పోషించారు. పరిశోధన ప్రారంభ దశ నుంచి అంశ ఎంపిక, పరిశోధన రూపకల్పన, సాంకేతిక విధానాల అభివృద్ధి, పరిశోధన విశ్లేషణ, ఫలితాల వివరణ వరకు తమ విలువైన మార్గదర్శకత్వం, సాంకేతిక సూచనలు, నిరంతర ప్రోత్సాహాన్ని అందించారు. వారి సహకారం, పర్యవేక్షణతో మచర్ల సుప్రియ తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు.
ఈ పరిశోధనకు జేఎన్టీయూహెచ్కు చెందిన డాక్టర్ కామాక్షి ప్రసాద్ మూల్యాంకనం నిర్వహించారు.
ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని మరింత విస్తరించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసే దిశగా ఈ పరిశోధన ప్రాధాన్యత సంతరించుకుంది.
మచర్ల సుప్రియ సాధించిన ఈ విద్యా విజయానికి పరిశోధన పర్యవేక్షకులు అందించిన సహకారం, మార్గదర్శకత్వం ప్రత్యేకంగా నిలిచాయి
