భారత్ సరిహద్దులో చైనా యుద్ధ విమానాలు!
హైదరాబాద్:జులై 28
భారత్ సరిహద్దు సమీపంలో చైనా తన సైనిక కదలికలను మరోసారి మమ్మురం చేసినట్టు తెలుస్తుం ది, వైమానిక స్థావరంలోఅత్యాధునిక ‘జె-20 మైటీ డ్రాగన్’ స్టెల్త్ యుద్ద విమానాల మోహరిం పును చైనా గణనీ యంగా పెంచింది. వాంటార్ శాటిలైట్ తీసిన ఫోటోల ప్రకారం..
ఈ ఏడాది జూన్ చివరి వారం, జులై ప్రారంభంలో చైనా తన రెండు ఎయిర్ బేస్‌లలో కలిపి దాదాపు 11 జె-20 యుద్ధ విమానాలను మోహరించినట్లు స్పష్టమవుతోంది. జులై 9న ఉపగ్రహాలు తీసిన ఫోటోల ప్రకా రం.. షింజియాంగ్ ఉయ్ఘర్ అటామస్ ప్రాంతంలోని రక్షణ, పౌర రవాణాకు ఉపయోగపడే హోతాన్ ఎయిర్‌బేస్ రన్‌వేపై ఏడు జె-20 విమానాలు నిలిపి ఉంచారు.
ఈ స్థావరం లేహ్‌కు ఈశాన్యంగా 389 కి.మీ, ఉత్తర లడఖ్ లోని భారత వాయు సేనకు చెందిన దౌలత్ బేగ్ ఓల్డీ రన్‌వేకు ఈశాన్యంగా కేవలం 245 కి.మీ దూరంలో ఉంది. మీడియా సేకరించిన ఉపగ్రహ ఫోటోల ప్రకారం.. ఓ చైనా ఎయిర్‌బేస్‌లో ఇంత పెద్ద సంఖ్యలో జె-20 విమానాలు కనిపించడం ఇదే మొదటిసారి.
భారత్‌వైపు 11 యుద్ధ విమానాలు
ఈ నివేదికలోని రెండో ఫోటో ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు వాయువ్యంగా 344 కి.మీ. దూరంలోని టిబెట్‌లోని లాసా పరిధిలో ఉన్న దమ్ షుంగ్ ఎయిర్‌బేస్‌లో నాలుగు జె-20 విమానాలు కనిపిం చాయి. హోతాన్లో ఏడు, దమ్షుంగ్లో నాలుగు జె-20 విమానాలను J 20 మోహరించడంతో….
భారత్‌కు సమీపంలో ఉన్న ఎత్తైన ప్రదేశాల్లోని స్థావరాల నుంచి 5జీ యుద్ధ విమాన కార్యకలా పాలు నిర్వహించడం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాయు సేనకు నిత్యకృత్యంగా మారింది.. ఇది కేవలం సంకేతాలు ఇవ్వడానికి పరిమితం కాదని స్పష్టమవుతోంది..
