రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఎంసీఆర్ హెట్ఆర్డీలో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ పాలస్ షిపొకోసా మషటైల్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో భేటీ అయింది.
✅ ఈ భేటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ దక్షిణాఫ్రికా – తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను, ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి గారు వివరించారు.
✅ భారత్లో అధికారిక పర్యటనలో భాగంగా మషటైల్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణలో ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
✅ అంతకుముందు తెలంగాణలో అధికారిక పర్యటనకు వచ్చిన మషటైల్ గారి బృందానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక స్వాగతం పలికారు.
✅ సమావేశంలో మషటైల్ గారు మాట్లాడుతూ, “తెలంగాణలో మా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ప్రభుత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు. ఈ వేడుకల సందర్భంగా మీ మధ్య ఉండటం గౌరవంగా భావిస్తున్నాం. ఈ పర్యటనలో శాస్త్రీయ, సాంకేతిక మరియు పెట్టుబడి సహకార రంగాల్లో మరింత విస్తృత భాగస్వామ్యాన్ని మేము ఆశిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.
✅ “భారతదేశంలోని అత్యంత యువ రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ, అతి తక్కువ కాలంలోనే భారత జాతీయ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి అత్యధికంగా తోడ్పడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగడం అభినందనీయం. తెలంగాణ ప్రజల పట్టుదల, సృజనాత్మకత, సంకల్పానికి ఈ విజయాలు నిదర్శనం” అని పేర్కొన్నారు.
✅ భారత్ – దక్షిణాఫ్రికా మధ్య సంబంధాల విషయంలో చారిత్రక నేపథ్యాన్ని సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు గారు వివరిస్తూ, “సాంకేతికత, ఔషధ రంగం, వ్యాక్సిన్లు, రక్షణ, ఏరోస్పేస్, పరిశోధన, విద్య, ఆరోగ్యం, తయారీ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల రంగాలలో తెలంగాణ విశిష్ట ప్రతిభను కలిగి ఉంది” అని చెప్పారు.
✅ “గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధి రంగాలలో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచే అవకాశాలు ఉన్నందున తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని దక్షిణాఫ్రికా కంపెనీలను ఆహ్వానిస్తున్నాం” అని చెప్పారు.
Telangana Ready to Support South African Investors: CM Revanth Reddy
Hyderabad: Telangana Chief Minister A. Revanth Reddy stated that the Telangana Government is fully prepared to extend all necessary support to South African entrepreneurs interested in investing in the state.
A delegation led by South African Deputy President Paul Mashatile met the Chief Minister at MCR HRD Institute in Hyderabad. The meeting was attended by Ministers Duddilla Sridhar Babu and Damodar Raja Narasimha, along with Chief Secretary K. Ramakrishna Rao and other senior officials.
The discussions focused on strengthening bilateral and trade relations between Telangana and South Africa. The Chief Minister highlighted the state’s investment opportunities, investor-friendly policies, and government incentives aimed at attracting global investments.
During the meeting, Deputy President Paul Mashatile thanked the Telangana Government for its warm hospitality and conveyed his greetings on Telangana State Formation Day. He expressed optimism about expanding cooperation in science, technology, innovation, and investment sectors.
Mashatile praised Telangana’s rapid growth, noting that despite being one of India’s youngest states, it has emerged as a significant contributor to the country’s GDP. He described the state’s achievements as a reflection of the determination, creativity, and resilience of its people.
Minister Sridhar Babu emphasized Telangana’s strengths in technology, pharmaceuticals, vaccines, defense, aerospace, research, education, healthcare, manufacturing, skill development, sports, and infrastructure. He also highlighted the state’s progress in green energy and sustainable development, inviting South African companies to explore investment opportunities in Telangana.
