జీతం ఇవ్వలేదని లారీని ఎత్తుకెళ్లిన డ్రైవర్
ములుగులో హల్చల్ చేసిన లారీ డ్రైవర్ ఉదంతంలో ట్విస్ట్ నెలకొంది. పోలీసులు తెలిపిన ప్రకారం..
గోవిందరావుపేటకు చెందిన వ్యక్తి భూపాలపల్లికి చెందిన లారీ ఓనర్ వద్ద పని చేస్తున్నాడు. వేతనం విషయంలో యజమానితో గొడవపడ్డ డ్రైవర్ లారీని తీసుకొని పరారయ్యాడు. జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసిన ఓనర్ ములుగు పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశాడు. జిల్లా కేంద్రంలోకి వచ్చిన లారీని ఆపే క్రమంలో పోలీసులతో డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు.
