దేశవ్యాప్తంగా 32 ఫేక్ యూనివర్సిటీలు.. ఏపీలో రెండు!???
దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తిస్తూ యూజీసీ ప్రకటన చేసింది. ఈ సంస్థలు జారీచేసే డిగ్రీలకు గుర్తింపు ఉండదని, ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు ఇవి చెల్లవని స్పష్టం చేసింది. ఫేక్ జాబితాలో ఢిల్లీలో 12, యూపీలో 4 ఉండగా.. ఏపీలో గుంటూరుకు చెందిన క్రైస్ట్ న్యూ టెస్టమెంట్, విశాఖలోని బైబిల్ ఓపెన్ వర్సిటీలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలోనూ నకిలీ వర్సిటీలున్నాయి. విద్యార్థులు చేరేముందే సంస్థ గుర్తింపును పక్కాగా చూసుకోవాలని యూజీసీ తీవ్రంగా హెచ్చరించింది
