పారిశుద్ధ్య కార్మికుడు.. నిజాయతీలో కుబేరుడు
తమిళనాడులో ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెత్తలో దొరికిన 20 సవర్ల (160 గ్రాముల) బంగారు నగలు, కిలో వెండి వస్తువులను పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నారు. తిరువారూర్ మున్సిపాలిటీలో దురై అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈయన ఆదివారం ఉదయం విధుల్లో ఉండగా చెత్తలో ఓ బ్యాగు కనిపించింది. తెరిచి చూడగా బంగారు నగలు, వెండి వస్తువులు ఉన్నాయి.
