లైట్‌వెయిట్ క్రిప్టోగ్రాఫిక్ గ్రూప్ కీ మేనేజ్మెంట్పై పీహెచ్డీ సాధించిన బొల్లెపోగు వెంకటేశ్వర్లు
ఇండోర్: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) భద్రత రంగంలో కీలకమైన పరిశోధన చేసి బొల్లెపోగు వెంకటేశ్వర్లు పీహెచ్డీ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు.
“లైట్‌వెయిట్ క్రిప్టోగ్రాఫిక్ గ్రూప్ కీ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్” అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) డిగ్రీని ప్రదానం చేశారు.
ఈ పరిశోధన డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో, ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ పరిశోధనకు డా. రాజీవ్ జి. విశ్వకర్మ గారు మార్గదర్శకులుగా వ్యవహరించారు.
తక్కువ వనరులతో పనిచేసే ఐఓటీ పరికరాలకు భద్రతను అందించేలా లైట్‌వెయిట్ క్రిప్టోగ్రాఫిక్ విధానాలను అభివృద్ధి చేయడమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశ్యం. ఈ అధ్యయనం భవిష్యత్‌లో స్మార్ట్ సిటీస్, హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ ఐఓటీ వంటి రంగాలకు ఎంతో ఉపయోగపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బొల్లెపోగు వెంకటేశ్వర్లు సాధించిన ఈ విజయం పరిశోధనా రంగంలో యువతకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వవిద్యాలయ వర్గాలు ప్రశంసించాయి
