తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ పరిస్థితి ఇది!
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ( అక్టోబర్ 29 ) కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. 16 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేయగా.. రాబోయే 24 గంటలు అంటే.. అక్టోబర్ 30వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని జనాన్ని అప్రమత్తం చేసింది వెదర్ డిపార్ట్ మెంట్.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్:
సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:
_ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, సూర్
