అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్
పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 5లక్షల92వేల రూపాయలతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు,ఒక కారు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్ తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
