అన్నా యూనివర్సిటీ నుంచి చిరంజీవి ఫణీంద్రకు పీహెచ్.డి డిగ్రీ
అన్నా యూనివర్సిటీ, చెన్నైలో పరిశోధక విద్యార్థి చిరంజీవి ఫణీంద్ర పీహెచ్.డి డిగ్రీని సాధించారు. “Twitter Sentiment Analysis for Tourism Recommendation System Using Artificial Intelligence” అనే పరిశోధన విషయంపై ఆయన చేసిన అధ్యయనాన్ని విశ్వవిద్యాలయం గుర్తించి ఈ గౌరవాన్ని అందించింది.
ఈ పరిశోధనలో డా. ఎ. రాజారామ్ మార్గదర్శకత్వం వహించారు. 2025 ఆగస్టు 14న విజయవంతంగా వైవా పూర్తిచేసిన అనంతరం చిరంజీవి ఫణీంద్రకు అధికారికంగా డాక్టరేట్ డిగ్రీ ప్రదానం అయింది.
చిరంజీవి ఫణీంద్ర మాట్లాడుతూ – “ఈ విజయం నాకు మద్దతు ఇచ్చిన నా కుటుంబం, మార్గదర్శకులు, సహచరులందరికీ అంకితం. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు ఆధారంగా పర్యాటక రంగానికి మరిన్ని వినూత్న పరిష్కారాలు అందించాలనుకుంటున్నాను” అని తెలిపారు.
