103 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడిన ప్రధాని మోదీ…
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ప్రధాని మోదీ తన రికార్డును తానే బ్రేక్ చేసి చరిత్ర సృష్టించారు. శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 103 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడారు. గతేడాది ఆయన 98 నిమిషాలు మాట్లాడారు. 1947లో జవహర్ లాల్ నెహ్రూ 72 నిమిషాలు, 2005లో మన్మోహన్ సింగ్ 50 నిమిషాలు ప్రసంగించారు. కాగా, 2014లో ప్రధాని మోదీ తొలిసారిగా ఎర్రకోటపై ప్రసంగించారు
