ప్రజల ఇబ్బందులను / కష్టాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం దొరికెవరకు అంత:కరణ శుద్ది తో ప్రయత్నం చేసే సాధనం Padmaprabha Telugu News Ads:- 9491028690, 9346365984,9441460160 news@padmaprabhanews.in www.padmaprabhanews.in
హైదరాబాద్:ఆగస్టు 09 సినీ పరిశ్రమలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె ఆరవ రోజుకు చేరింది,వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం. ఇప్పుడు కొత్తకొత్త కండిషన్లు పుట్టుకొచ్చి,ఇగో సమస్యలు మొదలై, చిక్కుప్రశ్నగా మారింది ప్పుడు. మొన్న లేబర్ కమిషన్‌తో రెండు వర్గాలూ కూర్చుని మాట్లాడినా సంధి కుదరలేదు.
30 శాతం జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది. నాలుగోరోజే ముగుస్తుందనుకున్న సమ్మె కొనసాగింది. నేటికీ ఆరవ రోజుకు చేరింది, డ్యాన్సర్స్- ఫైటర్స్ విషయంలో లోకల్ వాళ్లను ఎంతమందిని తీసుకోవాలి, నాన్ లోకల్ వాళ్లను ఎంతమందిని తీసుకోవాలి అనే రేషియో లెక్క కూడా కొలిక్కి రాలేదు.
ఇవన్నీ తేలిన తర్వాతే వేతనాల పెంపు సంగతి ఆలోచిస్తామంటోంది ఫిలిమ్ ఛాంబర్. ఈ పరిస్థితుల్లో “నో మోర్ షూటింగ్స్”.. అంటూ ఫిలిమ్ ఛాంబర్ బ్లాంకెట్ ఆర్డరిచ్చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్‌లు జరపకూడదని, అవుట్ డోర్ యూనిట్లు, స్టూడియో ల్లో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వకూడదని ఛాంబర్ నుంచి హుకుం జారీ అయింది.
ఫిల్మ్‌ఛాంబర్.. ఫిల్మ్ ఫెడరేషన్తో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్‌కి ముందు తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు సినీ కార్మిక నాయకుడ