31వ తేది నుండి రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం
వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేది నుండి మూడురోజుల పాటు తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 2025 నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మామూనూర్ పి.టి.సి వేదికగా నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లకు తెలంగాణ రాష్ట్రంలోని ఏడు పోలీస్ జోన్లతో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సిఐడి ఇంటెలిజెన్స్, యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరీటీ వింగ్ విభాగాలకు చెందిన సూమారు వెయ్యికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బంది సైటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్, డాగ్ స్వ్కాడ్, ప్రోపెషనల్ ఫోటో గ్రాఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీ పడుతారు. ఈ పోటీలను 31తేదిన ఉదయం 9 గంటలకు రాష్ట్ర స్థాయి పోలీస్ ఉన్నతాధికారి చేతుల మీదుగా ఈ రాష్ట్ర స్థాయి డ్యూటీ పోటీలను ప్రారంభించబడుతుందని అలగే ఆగస్టు 2వ తేదిన ఈ పోటీల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ముఖ్య అతిధిల చేతుల మీదుల విజేతలకు పతకాలను అందజేయడంతో పాటు, ఛాంఫియన్ షీప్ ట్రోఫీలను అందజేయడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు..
-వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము
