CA డే మరియు డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఘన సత్కారం
జూలై 1: CA డే మరియు డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్స్ మరియు డాక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న వృత్తిదారుల సేవలను గుర్తించి, వారికి సన్మానాలు అందించారు.
ఈ సందర్భంగా పలువురు రోటరీ క్లబ్ సభ్యులు, ప్రముఖ వ్యక్తులు హాజరై, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. “సమాజ నిర్మాణంలో డాక్టర్లు ఆరోగ్య రక్షకులైతే, చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్థిక శక్తిగా నిలుస్తారు” అంటూ పలువురు ప్రసంగించారు.
ఈ వేడుక ద్వారా వారికి కృతజ్ఞతను తెలియజేయడంతోపాటు, భవిష్యత్ తరాలకు ప్రేరణ కలిగేలా చక్కటి సందేశం అందించబడింది. ఈ కార్యక్రమలో సీఏ లు నంగునూరి వంశీ కృష్ణ, పూజ, పీవీ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
