వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్, బొల్లికుంటలో ఆరు రోజులపాటు నిర్వహించిన AICTE స్పాన్సర్డ్ ATAL ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా ముగిసింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో తాజా పరిజ్ఞానం, పరిశోధనా అవకాశాలు, బోధనా పద్ధతులపై లోతైన శిక్షణ అందించడంలో ఈ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషించిందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కళ్యాణపు శ్రీనివాస్ తెలిపారు.
ముఖ్య అతిది గా పాల్గొన్న ప్రిన్సిపాల్ డా. ఎం. శశిధర్ మాట్లాడుతూ ఈ శిక్షణలో పొందిన జ్ఞానం భవిష్యత్తులో అధ్యాపకుల బోధన-పరిశోధనా నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. AI ఆధారిత టూల్స్ ఉపయోగం, క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రయోగాలు, పరిశోధనా దిశల్లో అవకాశాలను వివరించారు మరియు కార్యక్రమం నిర్వహించడం కోసం సహకరించిన యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కో-కోఆర్డినేటర్ కే. రంజిత్ కుమార్ పాల్గొన్న అధ్యాపకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
విభిన్న కళాశాలల నుండి వచ్చిన అధ్యాపకులు ఈ FDP తమకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం జ్ఞానవంతంగా, సత్ఫలితాలను అందించినదిగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలొ అసిస్టెంట్ ప్రొఫెసర్ బైరపాక ప్రశాంతి, ప్రొఫెసర్ సయ్యద్ ముస్తక్ అహ్మద్ మరియు కాలేజ్ ప్రిన్సిపల్ డా. ఎం. శశిధర్ వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు
