రాష్ట్రంలోని కొత్త పట్టాదారు రైతులు ఈనెల 13వ తేదీలోగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. జూన్5 వరకు పట్టాపాసు బుక్వచ్చినా, అంతకు ముందు బీమా చేసుకోని రైతులు చేసుకోవాలని తెలిపింది. కొత్త రైతులు దరఖాస్తు ఫారం, రైతు పట్టాదారుపాసు బుక్ జిరాక్స్ కానీ, ఎమ్మార్వోతో డిజిటల్ సంతకం అయిన డిఎస్ పేపర్, రైతు ఆదార్ కార్డు, నామినీ ఆదార్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు.
14 ఆగస్టు 1966 నుంచి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే బీమాకు అర్హులు. అదార్ కార్డులో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు చేసింది.
