పవన్ కళ్యాణ్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్
పవన్ కళ్యాణ్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్
ఆంధ్రప్రదేశ్ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేపట్టిన కుంకీ ఏనుగుల ఆపరేషన్ విజయం సాధించింది. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను నాశనం చేస్తుండటంతో వాటి నుంచి పంటలను కాపాడడానికి వెళ్లి రైతులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి ఏనుగుల గుంపులను అడ్డుకునేలా చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్‌పై రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు…
