మడుపతి తేజస్వి డిప్యూటీ కలెక్టర్ (జనగం) విజయకథ
మడుపతి ప్రసూన మరియు మడుపతి సంగమేశ్ (కామ్కోల్) గారల కూతురు తేజస్వి గారు, సంగారెడ్డి నివాసి. సంగారెడ్డి యువకుడు సోమనాథ్ గారిని వివాహమాడిన తేజస్వి గారు, గత 4 సంవత్సరాలుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉద్యోగంలో ఉన్నప్పటికీ అహర్నిశలు కృషి చేసి, పోటీ పరీక్షల్లో మెరుగైన విజయాలు సాధించారు. 2020 లో గ్రూప్–4లో ఎంపికయ్యి, 2024లో మళ్లీ గ్రూప్–4ను సక్సెస్ అయ్యారు. అదే విధంగా 2025లో గ్రూప్–2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫైనల్ ఎంపికలో భాగంగా జనగం జిల్లా డిప్యూటీ కలెక్టర్ జనగాం హోదాకు ఎంపికయ్యారు.
తేజస్వి గారు పదవ తరగతిలోనూ, ఇంటర్మీడియట్‌లోనూ రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలిచారు.
తేజస్వి సోమనాథ్ ప్రజాసేవ మార్గంలో
పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో, శివుని ముఖం నుండి ఉద్భవించిన మా ఆది జగద్గురువులు పంచాచార్యుల అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుకసంపదలతో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
