పబ్జీ ఆడుతుండగానే… చిట్లిన మెదడు నరాలు! యువకుడి మృతి…!!
ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్‌కు చెందిన మహ్మద్ కైఫ్ (22) నాలుగు నెలలుగా పబ్జీ గేమ్‌కు తీవ్రంగా అలవాటుపడ్డాడు. రాత్రి హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అర్ధరాత్రి దాటే వరకు నిరంతరంగా పబ్జీ ఆడిన అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. వైద్యులు చికిత్స అందించినప్పటికీ అతడు మృతి చెందాడు.
అతడికి అధిక మానసిక ఒత్తిడి కారణంగా బీపీ 300కు పైగా పెరిగి, మెదడులోని నరాలు చిట్లి రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
