హైదరాబాద్:నవంబర్ 10
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు సంభవించింది, దీంతో చుట్టుపక్కల వాహనాలకు మంటలు అంటుకున్నాయి ఢిల్లీలో భారీ పేలుడుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకుంది.
మెట్రో స్టేషన్ వద్ద నిలిపి ఉంచిన కారు నుంచి పేలుడు సంభవించడంతో ఐదు కార్లు ధ్వంసం కాగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు సంభవించడంతో జనం భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. పేలుడుపై పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చేరుకుని.. మంటలు ఆర్పారు. సాయంత్రం 6.45 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రత దళాలు భగ్నం చేశాయి.. హర్యానా లోని ఫరీదాబాద్ లో ఒక వైద్యుడు ఇంట్లో భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు దొరికాయి. వీటితోపాటు మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేశారని తెలుస్తుంది.
ఈ క్రమంలో బాంబు పేలుడు జరగడం సంచలనంగా మారింది. పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించింది.
