రైళ్లలో వారికి లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి
రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎంచుకోకున్నా, అందుబాటును బట్టి ఆటోమేటిక్గా కింది బెర్తులు వస్తాయని అన్నారు. స్లీపర్, 3AC బోగీల్లో కొన్ని బెర్తులను పెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు కేటాయించినట్లు రాజ్యసభలో తెలియజేశారు. రైళ్లలో దివ్యాంగులు, సహాయకులకూ ఇలానే కొన్ని రిజర్వ్ చేసినట్లు చెప్పారు
