హనుమకొండలోని కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదమైన వాహనాలతో పాటు, సరియైన పత్రాలు లేని 8 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.
కమిషనర్ పరిధిలో కొనసాగుతున్న ఆకస్మిక తనిఖీలు
తనిఖీల్లో పాల్గొన్న వరంగల్ సీపీ
వరంగల్ సీపీ ఆదేశాల మేరకు ట్రైసిటీ పరిధిలో పోలీసు సిబ్బంది సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీలను దిగ్బంధం చేసి ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల వాహనాలు, ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు.
