తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
నిన్న TGలోని ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాల్టి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ
నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో కనిష్ఠంగా 9-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు.
