తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
హుస్నాబాద్: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఏరియల్ సర్వేకు వెళ్లారు. అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. సమ్మయ్యనగర్ లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. మొంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. లక్షలాది ఎకరాల పొలాలు నీటమునిగాయి. వేలాది ఇళ్లలోకి వరద నీరు చేసింది. సర్వం కోల్పోయిన బాధితులను సీఎం పరామర్శించారు. బాధితులతో మాటాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇస్తున్నారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
