పద్మప్రభ తెలుగు న్యూస్ – హైదరాబాద్
గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగా వైభవంగా బతుకమ్మ వేడుకలు

గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు, అధ్యాపకులు అంగరంగా వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ బానిసలు, పూలతో అలంకరించిన బతుకమ్మలను తెచ్చి విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సందడి చేశారు. కళాశాల ప్రాంగణం మొత్తం పాటలతో, నృత్యాలతో మారుమ్రోగింది.
ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని, ఈ తరహా వేడుకలు యువతలో సంప్రదాయాలపై గౌరవం పెంచుతాయని తెలిపారు.
విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేశారు.
