హైదరాబాద్:నవంబర్ 22
మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఎన్కౌంటర్లతో కాకవికలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ డిజిపి ఎదుట ఈరోజు మధ్యాహ్నం భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది…
వీళ్లలో ముఖ్య నేతలతో పాటు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది వరకు ఉన్నట్లు సమాచారం.. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న క్రమంలోనే మావోయిస్టులు ఆయు ధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అభివృద్ధిలో భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే,
ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కూడా లొంగిపోతు న్నట్లు తెలుస్తుంది, లొంగిపోతున్న వారిలో మావోయిస్టు కీలక నేత ఆజాద్, తో పాటు…. కొయ్యడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాల యంలో డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు
