బొల్లికుంట: వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో AICTE స్పాన్సర్డ్ ATAL ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం డిసెంబర్ 1, 2025న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం విద్యా రంగంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది.
కాలేజ్ సిబ్బంది మరియు పలు ఇతర విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొఫెసర్లు, పరిశీలకులు మరియు మార్గదర్శకుల ఆధ్వర్యంలో ఆధునిక అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఉపాధ్యాయులు నూతన శిక్షణ, పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందారు.
ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల అధ్యాపన నైపుణ్యాలు మెరుగుపడుతాయని, విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు సమర్థవంతమైన విద్యా అనుభవం అందించగలరని కాలేజ్ అధికారులు తెలిపారు.ఈ ప్రోగ్రాం ద్వారా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ లొ కొత్త పరిశోదనా మరియు అధ్యయన మెలుకువలను అధ్యాపకులు నేర్చుకుంటారని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కల్యాణపు శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డా. వినయ్ రాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం AI అన్ని రంగాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా విద్యారంగంలొ AI వాడకం గురించి వివరించారు ఈ సదస్సు నిర్వాహకులు కో-కోఆర్డినేటర్ కాత రంజిత్ కుమార్, ప్రొఫెసర్ కే షర్మిల, ప్రొఫెసర్ రేఖా గంగుల, ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ శివశంకర్, ప్రొఫెసర్ సయ్యద్ ముస్తక్ అహ్మద్, ప్రిన్సిపాల్ డా. M శశిధర్ మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు

