యువపరివర్తన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం…
వర్ధన్నపేట పట్టణం లో మెగా జాబ్ మేళాను – సద్వినియోగం చేసుకోవాలని పిలుపు…
నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 10/10/25 శుక్రవారం రోజు ఉదయం 9.30 నుండి మెగా జాబ్ మేళా వర్ధన్నపేట లో నిర్వహించనున్నారు. వర్ధన్నపేట లోని కె.ఎస్.డబ్ల్యు.ఏ యువ పరివర్తన్ ఫాండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు
వరంగల్ జిల్లా మేనేజర్ నరేష్ కెంచ గారు
యువపరివర్తన్ Placement Co-Ordinator బెల్లంకొండ వెంకట్ గారు
వర్ధన్నపేట మేనేజర్ రంజిత్ గారు తెలిపారు…
ముఖ్య అంశాలు:
పాల్గొనే కంపెనీలు: సుమారు 34 ప్రముఖ జాతీయ, రాష్ట్ర స్థాయి కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి…
ఉద్యోగ అవకాశాలు: సాఫ్ట్వేర్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెల్త్‌కేర్, టెక్నీషియన్, టైలరింగ్,బ్యూటిషన్,మెకనిక్,తదితర రంగాలలో దాదాపు 300 కు పైగా ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు…
అర్హతలు: ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు వారి విద్యార్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు…
రిజిస్ట్రేషన్ వివరాలు:
అభ్యర్థులు తమ బయోడేటా (5 కాపీలు), విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నేరుగా మేళాకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ఈ జాబ్ మేళా ముఖ్య పాత్ర పోషిస్తుందని, మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు…
