బీఆర్ఎస్పై కవిత సంచలన వ్యాఖ్యలు?
TG: తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందేనన్నారు. దీన్ని BRS నేతలు వ్యతిరేకించడం తప్పన్నారు. తాను నిపుణులతో చర్చించే ఆర్డినెన్సు మద్దతిచ్చానని, BRS వాళ్లు తన దారికి రావాల్సిందేనని స్పష్టం చేశారు.
