రేపటి నుంచి పాదయాత్ర, శ్రమదానం ప్రారంభించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమాలు ఆగస్టు 6 వరకు కొనసాగుతాయన్నారు. పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభమై వరంగల్ జిల్లా వర్ధన్నపేట వరకు సాగుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిగి, మెదక్ జిల్లాలో ఆందోల్, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేటలో జరుగుతాయని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఢిల్లీకి వెళ్లే కార్యక్రమం గురించి చర్చ ఉంటుందన్నారు. పది ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లతో మంగళవారం సమావేశం నిర్వహించామని, నామినేటెడ్ పోస్ట్ లపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు.
కార్పొరేషన్ల పోస్ట్ లు, డైరెక్టర్ల నియామకానికి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
