ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
నేరాల నియంత్రణతో పాటు, నేరస్థులను పట్టుకోవడంలో పోలీస్ అధికారులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపు నిచ్చారు. జూన్ నెల సంబంధించి నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండిరగ్లో వున్న కేసులను సమీక్ష జరపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకై ఆర్బన్, మున్సిపల్, గ్రామ స్థాయిల్లోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేజ్ పోలీస్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయాలని, ప్రతి వి.పి.ఓ వద్ద, నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక ఉదయం 6గంటల వరకు పెట్రొలింగ్ కొనసాగించాలని, అలాగే పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ముందుగానే స్టేషన్ అధికారులు తెలియజేప్పాల్సి వుంటుందని. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అంశంపై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగిప్పుడు పోలీస్ అధికారులు సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో రోడ్డు ప్రమాదాలకు గల కారణలపై క్షేత్ర స్థాయిలో సమీక్ష జరపాలని సిపి తెలిపారు. యువతను రక్షించుకోవడంలో భాగంగా డ్రగ్స్ అలవాటు పడి పోలీసులకు చిక్కిన యువతను పునరావస కేంద్రాలకు తరలించి చికిత్స అందించేందుకు కార్యచరణ ప్రణాళికను రూపోందించాలని, పోలీస్ కమిషనర్ తెలియజేసారు. పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ తప్పనిసరిగా కేసులను నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుండి ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిసిపిలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, వరంగల్,జనగాం ఏఎస్పీ శుశుభం, చేతన్, అదనపు డిసిపిలు ప్రభాకర్, బోనాల కిషన్ఇ రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు,ఆర్.ఐలు, ఎస్.ఐలు పాల్గోన్నారు
