బంగారం స్మగ్లింగ్ కేసు.. కన్నడ నటికి ఏడాది జైలు శిక్ష
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష పడింది. ఈ ఉత్తర్వును విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) సలహా బోర్డు ఆమోదించింది. రన్యా రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు ఈ కేసులో ఉన్నారు. ఈ శిక్షా కాలంలో వారిలో ఎవరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేరు.
