పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎల్కతుర్తి పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు స్టేషన్ ఎస్.ఐ మహేందర్ పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ తో పాటు కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా
పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు అనంతరం సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చివరగా పోలీస్ కమిషనర్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే… ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది” అని సీపీ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా,కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సిఐ పులి రమేష్ వున్నారు.
