రాష్ట్రంలో పెట్టుబడులకు కోల్ ఇండియా సిద్ధం:
కిషన్ రెడ్డి
TG: రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా, NLC ఇండియా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయన్నారు. పంప్డ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్లోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
