డిసెంబర్లో కొత్త ఆధార్ కార్డు…
వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డు లో ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించనున్నారు.
ఈ కొత్త కార్డులో ఉండే ఎన్క్రిప్టెడ్ QR కోడ్ ద్వారానే అవసరమైన సమాచారం ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. దీనిని కేవలం అధికారిక పద్ధతుల ద్వారా మాత్రమే స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
UIDAI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటళ్ళు, కార్యాలయాలు, ఈవెంట్లలో ఆధార్ కార్డు ఫోటోకాపీలు తీసుకొని నిల్వ చేసేవారికి ఇది పెద్ద పరిరక్షణగా మారనుంది. ఈ కొత్త రూపకల్పనతో గోప్యత పెరగడమే కాకుండా డేటా దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు
