ముఖ్యమంత్రి గారికి వరంగల్ మహా నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని..
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న నగర అపార్ట్మెంట్ ప్రజలకు ఉపశమనం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం..
వరంగల్ మహా నగరంలో పేద మధ్య తరగతి కుటుంబాలకు కలల సౌదమైన ఇంటిని ఎక్కువ శాతం అపార్ట్మెంట్ ల ద్వారా నిర్మించుకుంటూ ఉండే క్రమంలో గత ప్రభుత్వం తెచ్చిన కొన్ని అనాలోచిత నిర్ణయం వలన 25 రేట్లు పెనాల్టీలు పడటం వలన లక్షల్లో జరిమానా రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే గౌరవ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం 25 రేట్లు పెనాల్టీలు పడ్డ అంశంపై చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో లక్షల్లో పెనాల్టీలు ఉన్న అపార్ట్మెంట్ వాసులకు పెనాల్టీ నుంచి రుణ విముక్తి కలగడం పట్ల గౌరవ తెలంగాణవరంగల్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మరియు వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
