బిహార్ సీఎంగా మరోసారి నితీశ్.. కేబినెట్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు
బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ కుమార్ పేరును బీజేపీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బిహార్ గవర్నర్కు సమర్పించారు. గురువారం ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19 మంది
మంత్రులు ప్రమాణం చేయనున్నారు
